Thursday, July 14, 2016

సత్యవేడు టైమ్స్ మొదటి సంచిక కథనాలు

Sathyavedu Times First Issue released. సత్యవేడు టైమ్స్ మొదటి సంచిక విడుదలైంది. ముఖ్యమైన వార్తా కథనాలు
1. ఉన్నత విద్యకు విద్యారుణాలు
2. పంచాయతీ భవనాలకు రూ. 15 లక్షలు
3. రాచరికాన్ని తలపిస్తున్న నాయకుల జీవనశైలి
5. అవినీతి నిర్మూలనకు ఆరు సూత్రాలు. 
6. ప్రాథమిక విద్యలో ప్రపంచదేశాల చూపు ఫిన్లాండ్ వైపు
7. ఆగస్టు 15న ఆదర్శ పురస్కారాల ప్రదానం
8. నవోదయా ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
9. బిచ్చగాడు చాటిచెప్పిన నిజం
10. 18న వృద్ధాశ్రమం, నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం
11. ఉచిత ఏఎన్ఎం కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
12. డిప్లమా విద్యార్థులకు మహీంద్రా స్కాలరం షిప్పులు
13. విదేశాల్లో మాస్టర్ డిగ్రీకోసం రూ. పది లక్షల చేయూత
14. ఇస్కాన్ పోటీ పరీక్షలలో మొదటి బహుమతి రూ. లక్ష
15. గ్రామీణ పేద విద్యార్థులకోసం స్వయం వెబ్ సైట్
16. బి.ఎస్.ఎన్.ఎల్ లో 2700 జూనియర్ ఇంజనీర్ పోస్టులు
17. మండల స్థాయి పాత్రికేయ మిత్రల నియామకం
18. ప్రజా సంక్షేమమే మిన్నగా కింగ్ మేకర్ జీవితం
19. ఆరో తరగతి ఫెయిల్....వందకోట్లకు అధిపతి
20. పదిహేను రూపాయల ప్రీమియం రూ. లక్షల భరోసా
ఇంకా లోకల్ రివ్యూ, న్యూస్ హైలైట్స్, వీక్లీ రౌండప్..మరెన్నో ఆసక్తికరమైన విశేషాలతో మార్కెట్లో విడుదలైంది. 16 పేజీలు పది రూపాయలు మాత్రమే.
వివరాలకు సంప్రదించండి. బి. శ్రీనివాసులు, చీఫ్ ఎడిటర్ 9505960598.

మంచి మార్పుకోసం మనవంతు ప్రయత్నం

శుభోదయం మిత్రులారా! మనం ప్రగతి దిశగా మార్పు గురించి పదేపదే మాట్లాడుతుంటాం. కానీ మనలో మార్పు గురించి మాత్రం ఆలోచించం. మనల్ని చెడు ఆకర్షించినంత వేగంగా మంచి ఆకట్టుకోవడం లేదు. కాబట్టే మార్పు సాధ్యం కావడం లేదు. స్వార్థ చింతన, సంకుచిత భావాలతో మన ప్రగతిని మనమే స్వయంగా అడ్డుకుంటున్నాం. సర్వేజనా సుఖినోభవంతు అనే సూక్తిని ఎవరు చెప్పారో ఏమోగానీ అది ఇచ్చే సంతోషం అంతాఇంతా కాదు. భగవంతుడు మనకు ఇచ్చిన అందమైన జీవితాన్ని అనందంగా ఆస్వాదించాల్సిన మనం ఎందుకు ప్రతికూల భావాలతో కుంగిపోవాలి? ఓ చక్కటి ప్రణాళికతో ముందుకు వెళితే విజయం తథ్యం. దానికి మనం ఏమి చేయాలనే దానిపై కాస్త అవగాహన కల్పించాలనే ప్రయత్నమే సత్యవేడు టైమ్స్ ఆవిష్కరణ. త్వరలో మనముందుకు రానున్న మన పత్రికను అలాగే ఒడిసి పట్టుకుని, ఆదరించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. సామాన్యుడి పక్షాన నిలబడే రీతోల ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారిగా గ్రామీణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని వెలువడే తొలి స్థానిక వార పత్రికగా సత్యవేడు టైమ్స్ ను విజయవంతంగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం.