Thursday, July 14, 2016

మంచి మార్పుకోసం మనవంతు ప్రయత్నం

శుభోదయం మిత్రులారా! మనం ప్రగతి దిశగా మార్పు గురించి పదేపదే మాట్లాడుతుంటాం. కానీ మనలో మార్పు గురించి మాత్రం ఆలోచించం. మనల్ని చెడు ఆకర్షించినంత వేగంగా మంచి ఆకట్టుకోవడం లేదు. కాబట్టే మార్పు సాధ్యం కావడం లేదు. స్వార్థ చింతన, సంకుచిత భావాలతో మన ప్రగతిని మనమే స్వయంగా అడ్డుకుంటున్నాం. సర్వేజనా సుఖినోభవంతు అనే సూక్తిని ఎవరు చెప్పారో ఏమోగానీ అది ఇచ్చే సంతోషం అంతాఇంతా కాదు. భగవంతుడు మనకు ఇచ్చిన అందమైన జీవితాన్ని అనందంగా ఆస్వాదించాల్సిన మనం ఎందుకు ప్రతికూల భావాలతో కుంగిపోవాలి? ఓ చక్కటి ప్రణాళికతో ముందుకు వెళితే విజయం తథ్యం. దానికి మనం ఏమి చేయాలనే దానిపై కాస్త అవగాహన కల్పించాలనే ప్రయత్నమే సత్యవేడు టైమ్స్ ఆవిష్కరణ. త్వరలో మనముందుకు రానున్న మన పత్రికను అలాగే ఒడిసి పట్టుకుని, ఆదరించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. సామాన్యుడి పక్షాన నిలబడే రీతోల ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారిగా గ్రామీణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని వెలువడే తొలి స్థానిక వార పత్రికగా సత్యవేడు టైమ్స్ ను విజయవంతంగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం.

No comments:

Post a Comment